న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల కమిషన్ (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావును (Actor Rajkummar Rao) తన నేషనల్ ఐకాన్‌గా నియమించనుంది. ఈ క్రమంలో గురువారం జరిగే ఓ కార్యక్రమంలో ఈసీ లాంఛనంగా ఆయన నియామకం చేపట్టనుంది.
వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 16 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న రాజస్ధాన్‌లో నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. చత్తీస్ఘఢ్లో నవంబర్ 7, నవంబర్ 17న రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, మిజోరాంలో నవంబర్ 7న పోలింగ్ జరుగుతుంది.
ఇక డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు జరిగే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సాధారణ ఎన్నికలకు ముందు జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు సెమీ ఫైనల్స్‌గా పరిగణిస్తున్నాయి.
Read More :