Garba Event | గార్భా వేడుకలో విషాదం : కూతురిని వేధించిన యువకులను మందలించగా వారేం చేశారంటే..!
గర్భా వేడుకలో (Garba Event) విషాదం చోటుచేసుకుంది. ఫరీదాబాద్‌లోని ఓ నివాస సముదాయంలో గర్భా ఆడుతుండగా చెలరేగిన వివాదం ఈ ఘటనకు దారితీసింది.
చండీఘడ్ : గార్భా వేడుకలో (Garba Event) విషాదం చోటుచేసుకుంది. ఫరీదాబాద్‌లోని ఓ నివాస సముదాయంలో గార్భా ఆడుతుండగా చెలరేగిన వివాదం ఈ ఘటనకు దారితీసింది. ఈ వేడుకల్లో తన కూతురును వేధించిన యువకులను ఓ వ్యక్తి (52) వారించగా వారు దాడిచేయడంతో అతడు మరణించాడు.
ఫరీదాబాద్‌లోని సెక్టార్ 86లోని ప్రిన్సెస్ పార్క్ సొసైటీలో జరిగిన గార్భా వేడుకల్లో వ్యక్తి కుటుంబం పాల్గొంది. ఇద్దరు యువకులు సదరు వ్యక్తి బాలికను ఆమె ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడిగారు. దాండియా వేడుకలో వారు బాలిక చేతిని అసభ్యంగా తాకారు.
ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో బాలిక తండ్రి యువకులను నిలదీశాడు. ఆపై జరిగిన ఘర్షణలో వ్యక్తి కుప్పకూలడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువకులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Read More :
Vote | మీ పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలా.. అయితే ఇలా చేయండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Dies
- Garba Event
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

