ముంబై : బుద్ధిజంపై ఫేస్బుక్లో అభ్యంతరకర కామెంట్లు పోస్ట్ చేశారనే ఆరోపణలపై మరాఠీ నటి కేతకి చితాలెపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద 2020లో కేసు నమోదైంది. ఈ కేసులో బెయిల్ కోరుతూ నటి థానే జిల్లా సెషన్స్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ఈ కేసులో ఈ ఏడాది మే 20న రబాలే పోలీస్ స్టేషన్లో చితాలెను అదుపులోకి తీసుకున్నారు.
మరో కేసుకు సంబంధించి థానే సెంట్రల్ జైలులో ఉన్న ఆమెను ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేవారు. 2020 మార్చి 1న ఫేస్బుక్ పోస్ట్ స్క్రీన్‌షాట్ తన వాట్సాప్‌కు వచ్చిందని మార్చి 3 2020న ఘన్సోలికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేయగా నటిపై కేసు నమోదు చేశారు. అంబేద్కర్‌పై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఓ కులాన్ని అవమానించేలా చితాలె వ్యవహరించారని ఫిర్యాదుదారు ఆరోపించారు.