Loksabha Elections 2024 : సినీ నటుడు, ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ శ్రీపెరంబదూర్ లోక్‌సభ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్ధి టీఆర్ బాలుకు మద్దుతగా ఆదివారం రోడ్‌షో నిర్వహించారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో దశకు రూ. 68,000 కోట్లు అవసరమవుతాయని అన్నారు.
కీలకమైన ఈ ప్రాజెక్ట్‌కు నిధులను సమకూరుస్తామని కేంద్రం హామీ ఇచ్చినా ఇప్పటివరకూ తమిళనాడుకు నిధులు రాలేదని ఈ సందర్భంగా కమల్ హాసన్ మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ద్రవిడ మోడల్‌ను బీజేపీ నేతలు విస్మరిస్తున్నారని, ద్రవిడ మోడల్ మన దేశానికి అవసరమైనదని ఆయన పేర్కొన్నారు. లౌకిక వ్యవస్ధకు విఘాతం కలిగించేలా కాషాయ పాలకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఇక 39 స్దానాలున్న తమిళనాడుతో పాటు, పుదుచ్చేరిలో ఒక స్ధానానికి ఏప్రిల్ 19న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More :
Tillu Square Movie | సిద్ధూ జొన్నలగడ్డ మేనియా.. రూ.100 కోట్ల క్లబ్లో ‘టిల్లు స్క్వేర్’