Loksabha Polls 2024 : రాయ్‌బరేలి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బరిలో దిగడంపై ఆ పార్టీ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం స్పందించారు. యూపీలోని ఘజియాబాద్‌లో ఆయన శుక్రవారం ఓ వార్తాసంస్ధతో మాట్లాడుతూ ప్రియాంక గాంధీని ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేయనీయరని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రియాంక గాంధీని ఎన్నికల బరిలో దింపడం రాహుల్‌కు ఇష్టం లేదని, ఈ విషయం తాను ఇంతకుముందే చెప్పానని గుర్తుచేశారు. కుటుంబంలో, పార్టీలో ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా భారీ కుట్రకు తెరలేపారని ఆరోపించారు.
కుటుంబంలో, పార్టీలో తనకు వ్యతిరేకంగా జరిగే కుట్రలో ఆమె బాధితురాలిగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి అమేథి నుంచి పోటీ చేయడం ఇష్టం లేకుంటే వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీని ఢీ కొనాలని ఆచార్య ప్రమోద్ కృష్ణం సూచించారు.
Read More :