న్యూఢిల్లీ: జిల్లా స్థాయిలో వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని, 15 నుంచి 18 ఏండ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో పరిస్థితులపై ఆదివారం ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా పరీక్షలు, జీనోమ్ సీక్వెనింగ్, వ్యాక్సిన్ ప్రక్రియపై శాస్త్రీయమైన పరిశోధన కొనసాగించాలని సూచించారు. సాధారణ వ్యాధులకు కూడా వైద్య సేవలు కొనసాగించాలని కోరారు.