తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి చెందిన ప్రముఖ నేత కేపీ అన్బళగన్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కేపీ అన్బళగన్కు చెందిన 57 ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. గతంలో తమిళనాడు కేబినెట్ మంత్రిగా కూడా అన్బళగన్ పని చేశారు.
విద్యాశాఖ మంత్రిగా అన్నాడీఎంకే ప్రభుత్వంలో సేవలందించారు. ఆయన ఇల్లు, ఆఫీసుపై ఒకేసారి అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించింది. ఆయనకు సంబంధించి చెన్నై, కృష్ణగిరి, ధర్మపురి, సేలం సహా మొత్తం 57 ప్రాంతాల్లో ఉన్న భవనాలు, కంపెనీలపై ఏసీబీ దాడులు జరిగాయి.