IMD | న్యూఢిల్లీ, ఏప్రిల్ 30 : ఈసారి మే నెలలో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ర్టాల్లో వేడి గాలులు వీచే రోజులు సాధారణం కన్నా ఎక్కువగా ఉంటాయని ఐఎండీ తెలిపింది. అయితే, మే నెలలో ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానల వల్ల ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరకుండా ఆగుతాయని ఐఎండీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.