చండీఘర్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. దురి నియోజకవర్గం నుంచి మాన్ బరిలో ఉన్నారు. ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్‌ను ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జనవరి 18న ప్రకటించిన విషయం విదితమే.
48 ఏండ్ల భగవంత్ మాన్ కమెడీయన్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగారు. సంగ్రూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. దురి అసెంబ్లీ నియోజకవర్గం సంగ్రూరు పార్లమెంట్ పరిధిలోనిది. ప్రస్తుతం దురి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు దల్వీర్ సింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.