న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎంవో నుంచి అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలను తొలగించి వాటి స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సోమవారం ఆరోపించింది. కాగా, ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందిస్తూ తన అవినీతిని, తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఆప్ ఇటువంటి ఆరోపణలు చేస్తోందని తిప్పికొట్టారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తన కార్యాలయంలో ఉన్న అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలను చూపుతూ ట్వీట్ చేసిన మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నాయకురాలు ఆతిశీ ప్రస్తుత సీఎం రేఖా గుప్తా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ఫొటోలను కూడా షేర్ చేశారు.