Delhi CM | మరికాసేపట్లో ఢిల్లీకి కొత్త సీఎంను ప్రకటించనున్న ఆప్..!
Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనతో దేశరాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి.
Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనతో దేశరాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. ఇవాళ సాయంత్రం కేజ్రీ తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు మరికాసేపట్లో తెరపడే అవకాశం ఉంది.
పార్టీ శాసనసభ సమావేశం తర్వాత ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించనున్నట్లు తెలిసింది. ఇవాళ ముఖ్యమంత్రి నివాసంలో ఆప్ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో చర్చించి ఢిల్లీ తదుపరి సీఎంను ఖరారు చేయనున్నారు. అనంతరం కొత్త సీఎం పేరును ప్రకటించనున్నట్లు ఆప్ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా నివేదించింది.
అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. ఆయన లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా అపాయింట్మెంట్ను కోరగా మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు సమయం ఇచ్చారు. దీంతో కేజ్రీవాల్ ఎల్జీని కలిసి తన రాజీనామాను సమర్పించనున్నారు. కాగా, సోమవారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న కేజ్రీవాల్ కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి పేరుపై కొందరు నేతలతో ముఖాముఖీ సమావేశమయ్యారు.
ఇదే సమయంలో పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు అతిశీ. కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో అన్నీ తానై పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ బాధ్యతలను చక్కదిద్దారు. ప్రభుత్వంలోని మొత్తం 14 విభాగాలకు ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న ఆమె.. కేబినెట్ మంత్రుల్లో అత్యధిక విభాగాలను కూడా చూస్తున్నారు. విద్య, ఆర్థికం, ప్రణాళిక, పీడబ్ల్యూడీ, వాటర్, పవర్, పౌర సంబంధాలు వంటి కీలక శాఖలను అతిశీ నిర్వహిస్తున్నారు. ఎడ్యుకేషన్‌పై వేసిన స్టాండింగ్ కమిటీకి ఆమె చైర్ పర్సన్‌గానూ పనిచేశారు.
అతిశీతోపాటు సౌరభ్ భరద్వాజ్, కైలాశ్ గెహ్లాట్, గోపాల్ రాయ్, ఎంపీ రాఘవ్ చద్ధా పేర్లను ఆప్ పరిశీలిస్తున్నట్టు మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇక మనీశ్ సిసోడియా.. కేజ్రీవాల్ బాటలోనే పయనిస్తున్నారు. ప్రజలు తన నిజాయితీని ఆమోదిస్తే మాత్రమే తాను కూడా మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా తిరిగి వస్తానంటూ తన నిర్ణయాన్ని ప్రకటించారు.
Also Read..
Mamata Banerjee | వైద్యుల డిమాండ్లకు తలొగ్గిన దీదీ సర్కార్.. కోల్‌కతా సీపీ సహా పలువురిపై వేటు
Balapur Laddu | మరోసారి రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎన్నిలక్షలంటే..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

