Jani Master | మహిళ కొరియోగ్రఫర్ను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదు చేశారని తెలిసిందే. ఈ కేసు విచారణను నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ముగ్గురు పోలీసులు తాజాగా కొరియోగ్రఫర్ నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు.
ఇక జానీ మాస్టర్‌పై బాధితురాలు సంచలన విషయాలు బయట పెట్టింది. బాధితురాలి ఇంట్లోనే నార్సింగి పోలీసులు 3 గంటల పాటు విచారించి ఆమె నుంచి వివరాలు సేకరించారు. జానీ మాస్టర్తనపై అత్యాచారం చేసి దాడి చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. షూటింగ్ టైంలో క్యారవాన్‌లో బలవంతం చేశాడు. సెక్స్ కోరిక తీర్చమని నన్ను ఎంతో వేధించాడని..తన మాట వినకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించాడని బాధితురాలు పేర్కొంది.
ఇదిలావుంటే ఆ విషయంపై విచారణను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఫార్వార్డ్ చేసినట్లు తెలుగు ఫిల్మ్ & టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ తెలిపింది. అలాగే ఈ కేసును విచారించడానికి ఛాంబర్ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే విచారణలో వెల్లడయిన విషయాలను బహిర్గతం చేయవద్దని మీడియాను కోరినట్లు తెలుస్తుంది. మరోవైపు లైంగికంగా వేధింపులకు గురైన అమ్మాయికి సంబంధించి ఫొటోలు కానీ వీడియోలు కానీ సోషల్ మీడియాలో ఉంటే తొలగించాలని కోరినట్లు తెలుస్తుంది.