Balapur Laddu | మరోసారి రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎన్నిలక్షలంటే..?
Balapur Laddu | తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ లడ్డూ (Balapur Laddu) మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది.
Balapur Laddu | తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ లడ్డూ (Balapur Laddu) మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్ చేస్తూ 30 లక్షల వెయ్యి రూపాలయకు కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. 1116 రూపాయలతో ప్రారంభమైన వేలం పాట క్రమంగా పెరుగుతూ.. రూ.30 లక్షల వద్దకు చేరుకుంది. ఆ తర్వాత ఎవరూ వేలం పాట పాడేందుకు ముందుకు రాకపోవడంతో కొలను శంకర్ రెడ్డికే బాలాపూర్ లడ్డూ దక్కింది.
రాష్ట్రంలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించే లడ్డూ వేలం అంటే ముందుగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేషుడే. ఏటా బాలాపూర్‌లో గణేషుడికి భారీ లడ్డూ నైవేద్యంగా పెడుతుంటారు. బాలాపూర్ లడ్డూ బరువు 21 కిలోలు. 1980లో మొదలైన ఈ సంప్రదాయాన్ని నిర్వాహకులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇక లడ్డూ వేలాన్ని తొలిసారిగా 1994లో నిర్వహించారు. ఆ సమయంలో రూ.450 ధర పలికింది. అప్పటి నుంచి ఏయేడాది కాయేడు రికార్డు ధరల పలుకుతూ లడ్డూ ప్రసాదం రూ.వందల నుంచి రూ.లక్షలకు చేరింది. గతేడాది రికార్డు స్థాయిలో రూ.27లక్షలకు పెరిగింది. గతేడాది స్థానికేతరుడైన దాసరి దయానంద్ రెడ్డి ఈ భారీ లడ్డూను దక్కించుకున్నారు. ఇక ఈ ఏడాది ఏకంగా రూ.30 లక్షలు ధర పలకడం విశేషం.
ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. ఈ ఏడాదితో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకున్నది. ఈ నేపథ్యలో లడ్డూకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని తొలిసారిగా నిర్వాహకులు వేలంలో కొత్త నిబంధనను తీసుకువచ్చారు. లడ్డూ వేలంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ముందస్తుగా డబ్బును డిపాజిట్ చేయాలని నిబంధనను తెచ్చారు. ఈ సారి అయోధ్య రామమందిరం నమూనాలో ఏర్పాటు చేసిన మండపంలో బాలాపూర్ గణపతి కొలువుదీరి పూజలందుకుంటున్నారు. మంగళవారం చివరి పూజ అనంతరం బాలాపూర్ బొడ్రాయి దగ్గర వేలంపాటను బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వహించింది. లడ్డూ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని అభివృద్ధి పనులకు వినియోగించనున్నారు.
లడ్డూ వేలం-విజేతలు
- 1994లో కొలను మోహన్‌రెడ్డి- రూ.450
- 1995లో కొలను మోహన్‌రెడ్డి- రూ.4,500
- 1996లో కొలను కృష్ణారెడ్డి- రూ.18 వేలు
- 1997లో కొలను కృష్ణారెడ్డి- రూ.28 వేలు
- 1998లో కొలన్ మోహన్ రెడ్డి లడ్డూ- రూ.51 వేలు
- 1999 కళ్లెం ప్రతాప్ రెడ్డి- రూ.65 వేలు
- 2000 కొలన్ అంజిరెడ్డి- రూ.66 వేలు
- 2001 జీ. రఘనందన్ రెడ్డి- రూ.85 వేలు
- 2002లో కందాడ మాధవరెడ్డి- రూ.1,05,000
- 2003లో చిగిరినాథ బాల్ రెడ్డి- రూ.1,55,000
- 2004లో కొలన్ మోహన్ రెడ్డి- రూ.2,01,000
- 2005లో ఇబ్రహీ శేఖర్- రూ.2,08,000
- 2006లో చిగురింత తిరుపతి- రెడ్డి రూ.3 లక్షలు
- 2007లో జీ రఘనాథమ్ చారి- రూ.4,15000
- 2008లో కొలన్ మోహన్ రెడ్డి- రూ.5,07,000
- 2009లో సరిత- రూ.5,10,000
- 2010లో కొడాలి శ్రీదర్ బాబు- రూ.5,35,000
- 2011లో కొలన్ బ్రదర్స్- రూ.5,45,000
- 2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి- రూ.7,50,000
- 2013లో తీగల కృష్ణారెడ్డి- రూ.9,26,000
- 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి- రూ.9,50,000
- 2015లో కొలన్ మధన్ మోహన్ రెడ్డి- రూ.10,32,000
- 2016లో స్కైలాబ్ రెడ్డి- రూ.14,65,000
- 2017లో నాగం తిరుపతి రెడ్డి- రూ.15 లక్షల 60 వేలు
- 2018లో తేరేటి శ్రీనివాస్ గుప్తా- రూ.16,60,000
- 2019లో కొలను రామిరెడ్డి- రూ.17 లక్షల 60 వేలు
- 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దు
- 2021లో మర్రి శశాంక్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్- రూ.18.90 లక్షలు
- 2022లో వంగేటి లక్ష్మారెడ్డి- రూ.24,60,000
- 2023లో దాసరి దయానంద్ రెడ్డి- రూ.27 లక్షలు
Also Read..
Mamata Banerjee | వైద్యుల డిమాండ్లకు తలొగ్గిన దీదీ సర్కార్.. కోల్‌కతా సీపీ సహా పలువురిపై వేటు
Praja Palana Dinotsavam | శాసనసభ ప్రాంగణంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

