Jalandhar Bypoll | జలంధర్ లోక్‌సభ స్థానంలో ఆప్‌దే హవా.. కాంగ్రెస్‌కు కనిపించని సానుభూతి
Jalandhar Bypoll | పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆధిక్యంలో కొనసాగుతున్నది.
జలంధర్: పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఆప్ అభ్యర్థి సుశీల్ రింకూ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కరమ్‌జీత్ కౌర్‌పై దాదాపు 7 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం సుశీల్ రింకూకు 60,088 ఓట్లు పోలవగా.. కరమ్‌జీత్ కౌర్‌కు 53,023 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత బీజేపీ 34,051 ఓట్లతో మూడో స్థానంలో, శిరోమణి అకాలీదళ్ 28,351 ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి.
జలంధర్ ఎంపీ సంతోక్ సింగ్ ఛౌదరి గుండెపోటుతో హఠాన్మరణం పాలవడంతో ఆ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. గత జనవరిలో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సంతోక్ సింగ్ గుండెపోటుతో మృతిచెందారు. కాంగ్రెస్ ఎంపీ మరణంతో ఉప ఎన్నికల వచ్చినా అక్కడ ఇప్పటివరకైతే కాంగ్రెస్ అభ్యర్థిపై ఓటర్లు సానుభూతి చూపినట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లోని ఐదు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో పంజాబ్‌లోని జలంధర్, ఉత్తరప్రదేశ్‌లోని సువార్, ఛంబే, ఒడిశాలోని ఝార్సుగూడ, మేఘాలయలోని సోహియాంగ్ లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.
Also Read..
Karnataka Assembly Election Results 2023 | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

