న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ విస్తరణ ప్రారంభోత్సవానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఆహ్వానించలేదని ఆప్ (AAP) వెల్లడించింది. ఈ వ్యవహారంలో కేంద్రం తీరుపై ఆప్ ఘాటుగా రియాక్టయింది. ఎయిర్పోర్ట్ లైన్‌ను రెండు కిలోమీటర్ల మేర విస్తరించారు. ఢిల్లీ మెట్రో ఎయిర్పోర్ట్ లైన్ విస్తరణను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. నూతన స్టేషన్ శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఆహ్వానించలేదని ఢిల్లీ మంత్రి సౌరవ్ భరద్వాజ్ ఆక్షేపించారు. ప్రధాని నరేంద్ర మోదీ వసుధైక కుటుంబం గురించి గొప్పగా చెబుతుంటారని, ఇటీవల ముగిసిన జీ20 నేతల సదస్సులోనూ ప్రపంచ నేతల ముందు ఇదే విషయం చెప్పారని గుర్తుచేశారు.
ప్రారంభోత్సవానికి అరవింద్ కేజ్రీవాల్‌ను ఆహ్వానించడంలో విఫలం కావడం వసుధైక కుటుంబ భావనకు విరుద్ధమని ఆప్ మంత్రి ఎద్దేవా చేశారు. వసుధైక కుటుంబం అంటే ప్రపంచమంతా ఒక కుటుంబమని అర్ధమని, కానీ మీ స్వదేశంలో మెట్రో ప్రారంభోత్సవానికి మూడుసార్లు ఎన్నికైన మంత్రిని, సీఎంను ఆహ్వానించలేదని అంటూ ఇదేనా ఒకే కుటుంబం అంటే అని నిలదీశారు.
Read More :
Asia Cup Final 2023 | ఆసియా కప్ ఫైనల్.. టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన వెంకీమామా