AAP Party | ఆ రెబల్ ఎంపీలపై వేటు వేయండి.. రాజ్యసభ చైర్మన్‌కు ఆప్ విజ్ఞప్తి
తమ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలపై అనర్హత వేటు వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ చైర్మన్‌ను కోరింది.
న్యూఢిల్లీ: తమ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలపై అనర్హత వేటు వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ చైర్మన్‌ను కోరింది. ఈ మేరకు ఆయనకు పిటిషన్ సమర్పించినట్టు ఆదివారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. ఆ ఏడుగురు ఎంపీలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. అవసరమైతే వారిపై న్యాయపరమైన చర్యలు చేపడతామని ఆయన ప్రకటించారు.
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ని ఉదహరిస్తూ ఈ తరహా రాజకీయ ఫిరాయింపులు ఉపేక్షించబడవని.. సుప్రీం కోర్ట్ తీర్పుల ప్రకారం ఈ తరహా ఫిరాయింపులు అనర్హతకు దారి తీస్తాయని తెలిపారు. పంజాబ్‌లోని కొందరు ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారన్న వార్తలను సింగ్ ఖండించారు.
కేజ్రీవాల్ ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ‘శీష్ మహల్ 2’గా ప్రచారం చేస్తూ.. దాని సుందరీకరణకు ప్రైవేట్ డబ్బును ఖర్చు పెట్టారన్న తప్పుడు వార్తలను ప్రసారం చేసిన చానళ్లపై పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

