Sandeep Pathak : దేశ రాజధానిలో నెలకొన్న జల సంక్షోభం ఆప్, బీజేపీల మధ్య రాజకీయ రగడకు కేంద్ర బిందువైంది. ఇరు పార్టీలు నీటి సమస్యకు మీరంటే మీరే కారణమని డైలాగ్ వార్‌కు తెరలేపారు. తాజాగా బీజేపీ చవకబారు రాజకీయాలతోనే నీటి సమస్య తలెత్తిందని ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ ఆరోపించారు.
దీర్ఘకాలంగా హరియాణ నీటి అవసరాల కోసం పంజాబ్ నీటిని సరఫరా చేస్తోందని, ఢిల్లీ వాసుల నీటి అవసరాల కోసం హరియాణ నీటిని సరఫరా చేస్తోందని చెప్పారు. ఢిల్లీ ప్రస్తుతం 90-95 ఎంజీడీ నీటి కొరతను ఎదుర్కొంటోందని పాఠక్ వివరించారు. మా హక్కులను మేం అడగకూడదని భావిస్తే మానవతా దృక్పథంతో హరియాణ ముందుకు వచ్చి సాయం చేయాలని పాఠక్ కోరారు.
ఇక అంతకుముందు ఢిల్లీలో నీటి ఎద్దడి విషయంలో ఆప్ లక్ష్యంగా ఢిల్లీ బీజేపీ చీప్ వీరేంద్ర సచ్దేవ విమర్శలు గుప్పించారు. ఆప్ ఎమ్మెల్యేలు, మంత్రులు నీటిని అమ్ముకోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని ఆరోపించారు.
Read More :
భవిష్యత్తు బ్రెయిన్ చిప్లదే.. ఫోన్లు ఉనికిలో ఉండవంటున్న ఎలాన్ మస్క్