భవిష్యత్తు బ్రెయిన్ చిప్లదే.. ఫోన్లు ఉనికిలో ఉండవంటున్న ఎలాన్ మస్క్
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచం శరవేగంగా పరుగులు తీస్తున్నది. దీంతో మనిషి జీవనశైలి సమూలంగా మారిపోతున్నది. ఇప్పటికే స్మార్ట్ఫోన్లు మన జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చాయి.
న్యూఢిల్లీ, జూన్ 18: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచం శరవేగంగా పరుగులు తీస్తున్నది. దీంతో మనిషి జీవనశైలి సమూలంగా మారిపోతున్నది. ఇప్పటికే స్మార్ట్ఫోన్లు మన జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చాయి. కానీ, భవిష్యత్తులో ఫోన్లు మనుగడలో ఉండవట. వాటి స్థానంలో ఎలక్ట్రానిక్ బ్రెయిన్ చిప్‌లు ఉనికిలోకి వస్తాయని ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ చెప్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీ ఇటీవల ఓ మనిషి మెదడులో తొలిసారి విజయవంతంగా ఓ ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చింది. ప్రమాదం వల్ల మెడ కింది భాగమంతా చచ్చుబడిపోయిన నోలాండ్ అర్బాగ్ (29) అనే వ్యక్తికి ఈ ఏడాది జనవరి 28న ఈ బ్రెయిన్ చిప్‌ను అమర్చారు. ఈ సర్జరీ జరిగి 100 రోజులు పూర్తవడంతో అర్బాగ్ ఆరోగ్య పురోగతికి సంబంధించిన సమగ్ర వివరాలను న్యూరాలింక్ కంపెనీతోపాటు ఎలాన్ మస్క్ వివిధ ట్వీట్లలో వెల్లడించారు.
భవిష్యత్తులో ఎవరి వద్దా ఫోన్లు ఉండబోవని, వాటి స్థానంలో న్యూరాలింక్‌లు ఆధిపత్యం చెలాయిస్తాయని తెలిపారు. న్యూరాలింక్ అనేది తమ టెలీపతి సైబర్నెటిక్ బ్రెయిన్ ఇంప్లాంట్ అని, ఇది కేవలం ఆలోచనల ద్వారానే మన ఫోన్లను కంప్యూటర్లను నియంత్రించేందుకు వీలుకల్పిస్తుందని వివరించారు. ఈ బ్రెయిన్ చిప్‌ను అమర్చిన తర్వాత అర్బాగ్ ఎవరి సాయం లేకుండా తన పనులను తానే చేసుకోగలుగుతున్నాడని, చెస్, వీడియో గేమ్‌లను సైతం ఆడగలుగుతున్నాడని పేర్కొంటూ.. అందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

