AAP MLAs | లోక్ సభ ఎన్నికలకు ముందు మద్యం పాలసీ కేసులో ఆప్ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌తో దేశరాజధాని ఢిల్లీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ కేసులో కేజ్రీవాల్‌కు స్థానిక రౌస్ అవెన్యూ కోర్టు ఈనెల 15వ తేదీ వరకూ జుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను అధికారులు తీహార్ జైలుకు తరలించారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా (AAP MLAs) కేజ్రీవాల్ ఇంటికి క్యూ కట్టారు. మంగళవారం మధ్యాహ్నం సౌరభ్ భరద్వాజ్, కైలాష్ గహ్లోట్ సహా పార్టీ ఎమ్మెల్యేలంతా కేజ్రీ నివాసానికి చేరుకున్నారు. అక్కడ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ (Sunita Kejriwal) తో సమావేశం కానున్నారు.
రాష్ట్రంలో పాలన, తమ సుప్రిమో అరెస్ట్ తర్వాత నెలకొన్న పరిస్థితులు, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు వంటి అంశాలపై వీరంతా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరి సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే, కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయన భార్య సునీత కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం బాధ్యతలు చేపడతారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ ఎమ్మెల్యేలంతా కేజ్రీ ఇంట్లో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
#WATCH | AAP MLAs including Saurabh Bharadwaj, Kailash Gahlot arrive at the residence of Delhi CM Arvind Kejriwal to meet his wife Sunita Kejriwal. pic.twitter.com/qiwG0Hio5H
— ANI (@ANI) April 2, 2024
Also Read..
Arvind Kejriwal | కేజ్రీవాల్ అభ్యర్థనలకు కోర్టు ఆమోదం.. ఏవేవి అనుమతించిందంటే..?
Arvind Kejriwal | తీహార్ జైల్లో.. యోగా, బ్రెడ్-టీతో రోజును ప్రారంభించిన కేజ్రీవాల్
Maneka Gandhi | కుమారుడికి బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంపై స్పందించిన మేనకా గాంధీ