Arrest : పంజాబ్ (Punjab) కు చెందిన ఆప్ ఎమ్మెల్యే (AAP MLA) రమల్ ఆరోరా (Ramal Arora) అవినీతి కేసు (Corruption case) లో అరెస్టయ్యారు. దొంగ నోటీసులు జారీచేసి పలువురి నుంచి వేలల్లో లంచం రూపంలో డబ్బు గుంజిన కేసులో అరోరా పేరు బయటికి రావడంతో పంజాబ్ విజిలెన్స్ బ్యూరో (VB) అధికారులు శుక్రవారం ఉదయం ఆయనను విచారణకు పిలిచారు. దాదాపు 8 గంటలపాటు ఆయనను ప్రశ్నించిన అనంతరం సాయంత్రం అరెస్ట్ చేశారు. దాంతో ఈ అవినీతి కేసులో విజిలెన్స్ బ్యూరో అరెస్ట్ చేసిన ఆప్ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది.
ముందుగా 2022 మే 24న పంజాబ్ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, మన్సా నియోజకవర్గ ఎమ్మెల్యే విజయ్ సింఘ్లాను విజిలెన్స్ బ్యూరో అరెస్ట్ చేసింది. ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 23న బటిండా గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే అమిత్ రతన్ కొట్ఫట్టను అదుపులోకి తీసుకుంది. తాజాగా జలంధర్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రమల్ ఆరోరాను అరెస్ట్ చేసింది. దాంతో ఈ కేసులో అరెస్టయిన ఆప్ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది.
జలంధర్ మున్సిపల్ కార్పోరేషన్లో పనిచేసే వశిష్ట్ అనే అధికారిని ఉపయోగించుకుని, అక్కడి కాలనీల వాసులకు తప్పుడు నోటీసులు ఇప్పించి, రకరకాల బెదిరింపులతో భయపెట్టి రమల్ ఆరోరా వారి నుంచి డబ్బులు గుంజినట్లు తేలింది. వశిష్ట్‌ను ఇంటరాగేట్ చేయడంతో ఈ విషయం బయటపడింది. అంతేగాక ఒక్కో ఫైల్‌ను క్లియర్ చేయడానికి వశిష్ట్ జనం నుంచి రూ.30 వేలు వసూలు చేసేవాడని, అందులో ఎమ్మెల్యేకు వాటా ఇచ్చేవాడని తేలినట్లు విజిలెన్స్ బ్యూరో వెల్లడించింది.
#WATCH | Jalandhar, Punjab: AAP MLA Ramal Arora arrested from his residence by the Vigilance Department. https://t.co/eIVTvfN1IS pic.twitter.com/vAcWF4yRpp
— ANI (@ANI) May 23, 2025