AAP MLA | న్యూఢిల్లీ : పంజాబ్‌లోని లుధియానా వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే మృతిపట్ల ఆప్ నాయకత్వం సంతాపం ప్రకటించింది.
శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఎమ్మెల్యే గురుప్రీత్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన తలలో రెండు బుల్లెట్ గాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు తనకు తానే ఆయన కాల్చుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తలలోనే రెండు బుల్లెట్ గాయాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆస్పత్రికి తరలించే లోపే ఎమ్మెల్యే ప్రాణాలు విడిచినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
గురుప్రీత్ గోగి 2022లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. లుధియానా వెస్ట్ నియోజకవర్గంలో పంజాబ్ మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే భరత్ భూషణ్‌ను గురుప్రీత్ ఓడించారు. ఆయనపై 7,500 ఓట్ల మెజార్టీతో గోగి గెలుపొందారు. ఇక శుక్రవారం పంజాబ్ స్పీకర్ కుల్తార్ సంధ్వాన్తో కలిసి లోహ్రీ ఫంక్షన్‌కు ఎమ్మెల్యే గోగి అటెండ్ అయ్యారు.
ఇవి కూడా చదవండి..
Modi | నేనూ మనిషినే.. దేవుడిని కాదు.. పొరపాట్లు చేసి ఉండొచ్చు : మోదీ
Beer | కర్ణాటకలో మళ్లీ బీర్ల ధరల బాదుడు! మందుబాబులకు కాంగ్రెస్ సర్కార్ షాక్