AAP leaders | అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీలో ఆప్‌కు షాక్..!
AAP leaders | అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ముందు దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు బల్బీర్ సింగ్ (Balbir Singh), సుఖ్బీర్ దలాల్ (Sukhbir Dalal) రాజీనామా చేసి బీజేపీ (BJP) లో చేరారు.
AAP leaders : అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ముందు దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు బల్బీర్ సింగ్ (Balbir Singh), సుఖ్బీర్ దలాల్ (Sukhbir Dalal) రాజీనామా చేసి బీజేపీ (BJP) లో చేరారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ (Virendra Sachdeva), పార్టీ జనరల్ సెక్రెటరీ ఆశీశ్ సూద్ (Ashish Sood), కేంద్ర మంత్రి హర్ష మల్హోత్ర (Harsha Malhotra) సమక్షంలో ఆ ఇద్దరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
బల్బీర్ సింగ్ ఏకంగా ఆరు పర్యాయాలు ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. బీజేపీ ప్రభుత్వం తన సూచనను పరిగణలోకి తీసుకోవడం లేదని, ఢిల్లీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే స్కూళ్లలో పంజాబీ టీచర్లను నియమించడం లేదని ఆయన ఆరోపించారు. ఢిల్లీ సర్కారు ఏ పనీ సరిగా చేయడం లేదని సుఖ్బీర్ దలాల్ విమర్శించారు.
కాగా, ఢిల్లీలో వచ్చే ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీ కూడా త్వరలో తమ జాబితాను వెల్లడించే అవకాశం ఉంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి, ముఖ్యమంత్రి అతిషి కల్కాజీ నుంచి, మంత్రులు సౌరభ్ భరద్వాజ్ గ్రేటర్ కైలాస్ నుంచి, గోపాల్ రాయ్ బాబర్పూర్ నుంచి బరిలో దిగనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

