న్యూఢిల్లీ: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదని ఆప్ నేత సంజయ్ సింగ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) విజయం కోసం అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేస్తారని ఆప్ శనివారం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో కూటమిలోని శివసేన (యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ) నేతలు కేజ్రీవాల్‌ను ప్రచారం కోసం సంప్రదించారని ఆప్ వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్ మహారాష్ట్రలో ఎంవీఏ అభ్యర్థుల కోసం, జార్ఖండ్‌లో జేఎంఎం అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తారని వెల్లడించాయి.