న్యూఢిల్లీ: ఇంటి బయట పార్క్ చేసిన కారు నాలుగు చక్రాలు చోరీ అయ్యాయి. (Car Wheels Stolen) ఇది చూసి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అవధ్ ఓజా షాక్ అయ్యారు. (AAP Leader Avadh Ojha) రద్దీ ప్రాంతంలో పగలే ఈ చోరీ జరిగినట్లు ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఆప్ నేత అవధ్ ఓజా పట్పర్గంజ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. శుక్రవారం బయట పార్క్ చేసిన తన కారుకు ఉండాల్సిన నాలుగు వీల్స్ మాయం కావడాన్ని ఆయన గమనించారు. దొంగలు ఇటుక రాళ్లు ఉంచి కారు నాలుగు చక్రాలను చోరీ చేసినట్లు ఆయన ఆరోపించారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి సంఘటన ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. తన కారు చక్రాల చోరీపై ఒక వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఆప్ నేత అవధ్ ఓజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పట్పర్గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే బీజేపీకి చెందిన రవీందర్ సింగ్ నేగి చేతిలో ఆయన ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల్లో రెండవ స్థానంలో నిలిచారు.
All the four wheels of a car were stolen at Patparganj in Delhi, video shared by AAP leader Avadh Ojha.#TyreChor #TyreTheft #Delhi #AvadhOjha pic.twitter.com/gDy6qPg5BD
— Surya Reddy (@jsuryareddy) February 28, 2025