AAP Haryana Leader Quits : ఈ ఏడాది చివరిలో జరిగే హరియాణా అసెంబ్లీ ఎన్నికలతో పాటు రానున్న సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీతో అవగాహనను వ్యతిరేకిస్తూ ఆప్ దళిత నేత గురువారం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీతో విభేదిస్తూ రాజీనామా చేస్తున్నానని ఆప్ క్యాంపెయిన్ కమిటీ చీఫ్, హరియాణకు చెందిన దళిత నేత అశోక్ తన్వర్ వెల్లడించారు.
పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తన్వయ్ తన రాజీనామా లేఖ పంపారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కాంగ్రెస్‌తో ఆప్ సంప్రదింపులను తన్వర్ తప్పుపట్టారు. కాంగ్రెస్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ చర్చల నేపధ్యంలో ఇక పార్టీలో కొనసాగేందుకు తాను నమ్ముకున్న నైతిక విలువలు అనుమతించవని, తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో తన్వర్ కేజ్రీవాల్‌ను కోరారు.
కాంగ్రెస్ నుంచి 2022లో ఆప్‌లో చేరిన తన్వర్ బీజేపీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. తన రాజీనామా లేఖలో ఇండియాను భారత్‌గా ప్రస్తావించడంతో ఆయన కాషాయ గూటికి చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2009లో కాంగ్రెస్ నుంచి సిర్సా ఎంపీగా గెలుపొందిన తన్వర్ ఆపై హరియాణా కాంగ్రెస్ చీఫ్‌గా ఎదిగారు. మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడాతో విభేదాల నేపధ్యంలో ఆయన కాంగ్రెస్‌ను వీడి ఆప్‌లో చేరారు.
Read More :
CM Arvind Kejriwal | నేడు గోవాకు ఢిల్లీ సీఎం.. ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ గైర్హాజరు!