CM Arvind Kejriwal | నేడు గోవాకు ఢిల్లీ సీఎం.. ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ గైర్హాజరు!
మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) మరోసారి గైర్హాజరవనున్నారు. గురువారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ (ED) నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) మరోసారి గైర్హాజరవనున్నారు. గురువారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ (ED) నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్ దానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. మూడు రోజుల పర్యటన నిమిత్తం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌తో కలిసి ఆయన నేడు గోవాకు (Goa) బయల్దేరనున్నారు. అక్కడ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో పాల్గొంటారు. దీంతో నాలుగోసారీ ఈడీ విచారణకు డమ్మా కొట్టనున్నారు.
కాగా, ఢిల్లీ మద్యం పాలసీల వ్యవహారంలో గతేడాది నవంబర్ 2న తొలిసారిగా సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు జారీచేసింది. అయితే దానిని ఆయన హాజరుకాలేదు. దీంతో డిసెంబర్ 21న మరోసారి తాఖీదులచ్చింది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు పది రోజులపాటు విపాసన మెడిటేషన్ క్యాంప్‌నకు వెళ్లారు. ఈ నేపథ్యంలో జనవరి 3న విచారణకు రావాలంటూ ఆప్ అధినేతకు మరోసారి నోటీసులు పంపించింది. అయితే దానికి కూడా సీఎం కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. తాజాగా జనవరి 18న రావాలని నోటీసులివ్వడంతో.. చట్టం ప్రకారం నడుచుకుంటానని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

