ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. పంజాబ్‌లో బంపర్ విక్టరీ సాధించిన తర్వాత భగవంత్ మాన్ ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసంలో ఆయన్ను కలుసుకున్నారు. వెళ్లగానే కేజ్రీవాల్ ఆశీర్వచనాలు తీసుకున్నారు భగవంత్ మాన్. ఈ తర్వాత సీఎం కేజ్రీవాల్ ఆయన్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ అగ్రనేత మనీశ్ సిసోడియాతో కూడా భగవంత్ మాన్‌తో భేటీ అయ్యారు.
మరోవైపు చండీగఢ్‌లో నేడు ఆప్ ఎమ్మెల్యేలందరూ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే భగవంత్ మాన్‌ను శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకోనున్నారు. ఇక భగవంత్ మాన్ శనివారం గవర్నర్‌తో భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరతారని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 16న పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో కాకుండా తన స్వగ్రామమైన ఖాట్కర్కలాన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.