MANIPUR| న్యూఢిల్లీ: బీజేపీ అంటే బ్రిజ్‌భూషణ్ జనతా పార్టీ అని ఆమ్ఆద్మీ పార్టీ అభివర్ణించింది. జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ పేర్కొన్నారు. ఘటనకు పాల్పడిన నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులను గుర్తించడంలో ఎందుకు జాప్యం జరిగిందని ఆమె ప్రశ్నించారు.
మహిళల ఊరేగింపు ఘటనపై ప్రధాని మోదీ ఈ రోజు మీడియా మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారని, అయితే 77 రోజులుగా మణిపూర్ అట్టుడుకుటుతున్నా ఇప్పటివరకు ఆయన ఎందుకు నోరుమెదపలేదని ప్రియాంక నిలదీశారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. పార్లమెంట్ సమావేశమైన మొదటిరోజే మణిపూర్ అంశం ఉభయసభలనూ కుదిపేసింది. ప్రతిపక్షాల ఆందోళనతో ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.