న్యూఢిల్లీ: బడ్జెట్ సెషన్ చివరి రోజున ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆప్, బీజేపీ సభ్యులు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. అలాగే బీజేపీ కౌన్సిలర్లు మేయర్ టేబుల్‌పైకి ఎక్కి నిరసన తెలిపారు. (Councillors Climb Table) ఈ హంగామాకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 17,000 కోట్ల బడ్జెట్‌ను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆమోదించింది. అయితే బుధవారం చివరి రోజు సమావేశం సందర్భంగా సభలో గందరగోళం తలెత్తింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దొంగ అని బీజేపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ ముర్దాబాద్ అని మెజారిటీ అయిన ఆప్ కౌన్సిలర్లు నినదించారు. ‘రాజ్యాంగమే మన గుర్తింపు. రాజ్యాంగాన్ని హత్య చేయడం మానండి’ అన్న పోస్టర్‌ను కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రదర్శించారు.
కాగా, మేయర్ మహేష్ కుమార్ ఛాంబర్ వద్దకు బీజేపీ కౌన్సిలర్లు దూసుకువచ్చారు. బడ్జెట్ ఆమోదాన్ని వ్యతిరేకించారు. మేయర్ టేబుల్‌పైకి వారు ఎక్కారు. బడ్జెట్ ప్రతులను చించి నిరసన తెలిపారు.
మరోవైపు దళితుడైన మేయర్ మహేష్ కుమార్‌పై బీజేపీ కౌన్సిలర్లు దాడి చేశారని ఆప్ కౌన్సిలర్లు ఆరోపించారు. ఒక మహిళా కౌన్సిలర్ గాయపడినట్లు తెలిపారు. కాగా, సభలో గందరగోళానికి సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | दिल्ली: MCD सदन में BJP और AAP पार्षदों ने एक दूसरे के खिलाफ किया प्रदर्शन किया। कांग्रेस पार्षदों ने भी पोस्टर लेकर प्रदर्शन किया, जिस पर लिखा था, ‘संविधान हमारी पहचान है, संविधान की हत्या बंद करो’।
2024-25 और आगामी वित्तीय वर्ष 2025-26 के बजट को अंतिम रूप देने के लिए… pic.twitter.com/EzLxDTJ3uY
— ANI_HindiNews (@AHindinews) March 19, 2025