న్యూఢిల్లీ, జూలై 12: సరిగ్గా నెల క్రితం జూన్ 12న అహ్మదాబాద్‌లో కూలిపోయి అగ్నికి అహుతైన ఎయిరిండియా విమాన ప్రమాదం ఇంధనం అందనందు వల్లే జరిగిందని విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) కేంద్ర ప్రభుత్వానికి శనివారం ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు సెకను తేడాలో ఆగిపోయాయి. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్టని మరో పైలట్‌ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్టు రిపోర్టులో ఉంది. కాక్‌పిట్‌లో అవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ వెల్లడించింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్టు తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఏఐబీ.. ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది. ‘క్షణాల్లో రెండు ఇంజిన్లకు ఫ్యూయల్ సరఫరా నిలిచిపోయింది. గాల్లోనే రెండు ఇంజిన్లు ఆగిపోయాయి’ అని నివేదిక తెలిపింది.
ఇంధన సరఫరాను నిలిపివేశారా?
పైలట్ పొరపాటున ఇంధన సరఫరాను నిలిపివేశారా? లేక దానికదే ఆగిపోయిందా? అన్నది మిస్టరీగా ఉంది. అహ్మదాబాద్ ప్రమాదంలో మాత్రం విమానం ఇంకా టేకాఫ్ దశలో ఉండటంతో తక్కువ ఎత్తులో ఉంది. ఇంధన సరఫరాను మళ్లీ కొనసాగించేంత సమయం లేకపోయింది. విమానం కేవలం 32 సెకన్లు మాత్రమే గాల్లో ఉంది. తర్వాత కిందిపడి పేలిపోయింది.
నివేదికలోని ముఖ్యాంశాలు