AAI Advisory | ఉత్తర భారతాన్ని గురువారం సైతం దట్టంగా పొగమంచు కమ్మేసింది. ఈ క్రమంలో గురువారం భారత విమానాశ్రయాల అథారిటీ (AAI) అడ్వైజరీ జారీ చేసింది. దృశ్యమానత తగ్గడంతో ప్రయాణీకులకు విమానాల ఆలస్యంపై హెచ్చరికలు చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా హెచ్చరికలు జారీ చేసింది. విపరీతమైన పొగు మంచు ఉత్తర భారతంలోని అనేక విమానాశ్రయాలను ప్రభావితం చేస్తోందని.. దాంతో విజిబిలిటీ తగ్గిందని, దాంతో విమానాలు ఆలస్యమవుతున్నాయని పేర్కొంది. ప్రయాణీకులు విమానాశ్రయాలకు వెళ్లే ముందు సంబంధిత ఎయిర్‌లైన్‌కు సంబంధించిన విమానాల స్టేటస్‌ను చెక్ చేయాలని.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా, వెబ్సైట్ హ్యాండిల్స్‌లో అప్డేట్స్ను ఫాలో కావాలని సూచించింది. అదే సమయంలో ఇండిగో ఎయిర్‌లైన్ సైతం ప్రయాణీలకులకు అడ్వైజరీ జారీ చేసింది. కొన్ని గమ్యస్థానాలకు వెళ్లే విమానాల్లో అంతరాయాలపై అప్డేట్ ఇచ్చింది.
రాంచీ, పాట్నా, వారణాసిలో దృశ్యమానత తక్కువగా ఉందని.. పొగమంచు కారణంగా విమానాల రాకపోకలు ప్రభావితం కావొచ్చని ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపింది. వాతావరణ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు విమానయాన సంస్థ పేర్కొది. గమ్యస్థానానికి సురక్షితంగా, సజావుగా చేరుకునేందుకు మేము తమవంతు కృషి చేస్తున్నట్లు చెప్పింది. ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు ప్రయాణించే విమానాల స్టేటస్‌ను చూస్తూ ఉండాలని కోరింది. తమ బృందం ప్రయాణీకులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చింది. సాధారణ విమానాల పునః ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో ఇందిరా గాంధీ విమానాశ్రయం ప్రయాణీకులకు అడ్వైజరీని జారీ చేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో అన్ని విమాన కార్యకలాపాలు సాధారణంగా ఉన్నాయని.. ప్రయాణీకులందరూ సజావుగా, ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటున్నామని.. విమానాశ్రయ అధికారులు ప్రయాణీకులను రియల్ టైమ్ అప్డేట్స్ కోసం సంబంధిత విమానయాన సంస్థలతో టచ్‌లో ఉండాలని చెప్పింది. ఇదిలా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాయు నాణ్యత పడిపోయింది. నగరాన్ని పొగమంచు కమ్మేసింది.