న్యూఢిల్లీ: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ‘మై ఆధార్’ పోర్టల్లో ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ సేవను పొడిగించింది. ఆధార్ కార్డుదారులు ఇప్పుడు తమ గుర్తింపు, చిరునామా ఆధార పత్రాలను ఎలాంటి రుసుము లేకుండా 2027, జూన్ 14 వరకూ అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం ఆన్లైన్లో మా త్రమే అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో తమ సమాచారాన్ని అప్డేట్ చేసుకుంటున్న ఆధార్ కార్డుదారుల నుంచి వస్తున్న సానుకూల స్పందనను దృష్టిలో ఉంచుకుని ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు యూఐడీఏఐ తెలిపింది. ఆధార్ కార్డుదారు లు కొత్త ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఈ కొత్త యాప్లో సురక్షితమైన క్యూఆర్ ఆధారిత ఆధార్ షేరింగ్, మెరుగైన గోప్యతా నియంత్రణలు, ఆధార్ సేవలకు సులభమైన యాక్సెస్ వంటి ఫీచర్లు ఉన్నాయని యూఐడీఏఐ వివరించింది.