న్యూఢిల్లీ, జూలై 17: యూట్యూబ్ వీడియోలతో కోటి రూపాయలకు పైగా సంపాదించిన ఓ యూట్యూబర్‌పై ఐటీ దాడులు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన తస్లీమ్ ఇంట్లో రూ.24 లక్షల నగదు లభ్యమైందని ఐటీ శాఖ సోమవారం పేర్కొన్నది.
అక్రమ పద్ధతుల్లో తస్లీమ్‌కు పెద్ద మొత్తంలో నగదు అందుతున్నదని ఐటీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఆరోపణల్ని తస్లీమ్ కుటుంబ సభ్యులు ఖండించారు. తస్లీమ్ తన యూట్యూబ్ చానల్ ద్వారా షేర్ మార్కెట్‌పై వీడియోలు చేస్తున్నాడని, రూ.1.2 కోట్లు ఆదాయం రాగా, రూ.4 లక్షలు పన్ను చెల్లించామని తస్లీమ్ సోదరుడు ఫిరోజ్ తెలిపాడు.