భోపాల్: మధ్యప్రదేశ్ ఛతర్‌పుర్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ నిషా బాంగ్రేను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె ఉద్యోగానికి జూన్‌లో రాజీనామా చేశారు. ప్రభుత్వం ఆమోదించకపోవడంతో సెప్టెంబరు 28 నుంచి బేతుల్ జిల్లా నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభించారు. సోమవారం భోపాల్ చేరుకున్నారని, సీఎం చౌహాన్ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించగా, అరెస్టు చేశారని కుటుంబసభ్యులు చెప్పారు.