న్యూఢిల్లీ: ఈ ఏడాది భారతీయులకు 10 లక్షలకు పైగా వీసాలను జారీచేసే ప్రణాళికలో ఉన్నామని అమెరికా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని స్టూడెంట్ వీసా దరఖాస్తులను ఈ వేసవిలో ప్రాసెస్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
హెచ్-1బీ, ఎల్ వీసాలకూ ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. పలు కాన్సులర్ సెక్షన్లలో ఈ వీసాల వెయిటింగ్ పీరియడ్ 60 రోజుల కంటే తక్కువే ఉన్నదని తెలిపారు.