Tigress Attack | తిరువనంతపురం : కేరళ రాజధాని తిరువనంతపురంలోని జూపార్కులో దారుణం జరిగింది. ఓ ఆడ పులి జూపార్కు సూపర్వైజర్పై ఆదివారం దాడి చేసి గాయపరిచింది.
వివరాల్లోకి వెళ్తే.. జూపార్కు సూపర్వైజర్ రామచంద్రన్ నాయర్ విధుల్లో భాగంగా.. పులి ఎన్‌క్లోజర్‌కు సమీపంలో ఉండి క్లీనింగ్ పనులను పర్యవేక్షిస్తున్నారు. అంతలోనే ఆడపులి బబిత తన ఎన్‌క్లోజర్ నుంచి తప్పించుకుని బయటకు వచ్చి సూపర్వైజర్పై దాడి చేసింది. ఈ దాడిలో ఆయన తలకు తీవ్రమైంది. అప్రమత్తమైన సిబ్బంది.. పులిని మళ్లీ ఎన్‌క్లోజర్‌లో బంధించారు.
గాయపడిన రామచంద్రన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆయనను తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. సూపర్వైజర్ తలకు నాలుగు కుట్లు పడ్డాయని, ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఆడపులిని 2024 ఏప్రిల్‌లో వయనాడ్ నుంచి తిరువనంతపురానికి తరలించినట్లు అధికారులు తెలిపారు.