రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో ఇవాళ 53వ బెటాలియన్‌కు చెందిన ఇంటో టిబెటన్ బోర్డర్ పోలీసులు(ఐటీబీపీ) కూంబింగ్ నిర్వహించారు. కురుష్నార్ రోడ్డులో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబును ఐటీబీపీ జవాన్లు నిర్వీర్యం చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.
బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని టెర్రం అడవుల్లో గడిచిన శనివారం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల దాడిలో 22 మంది జవాన్లు మృతిచెందిన విషయం విదితమే. మావోయిస్టుల చెరలో ఉన్న జవాన్ రాకేశ్వర్ సింగ్‌ను ఐదు రోజుల తర్వాత విడుదల చేసిన సంగతి తెలిసిందే.
A tiffin Improvised Explosive Device (IED) was unearthed today by 53rd Battalion Indo-Tibetan Border Police (ITBP) near a road in Kurushnar, Narayanpur, Chhattisgarh: ITBP pic.twitter.com/q0o0XrASOs
— ANI (@ANI) April 10, 2021