గోండా(యూపీ), ఫిబ్రవరి 10: ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకొన్నది. ఐదేండ్ల బాలికపై ఇద్దరు సహ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులైన బాలలు 8, 10 ఏండ్ల వాళ్లని, నీలి చిత్రాల ప్రభావంతో తాము ఈ నేరానికి పాల్పడినట్టు వారు ఒప్పుకొన్నారని పోలీసులు శనివారం వెల్లడించారు.
గోండా జిల్లా ధనేపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని తెలిపారు.