ఎలక్షన్లు వస్తే రాజకీయ నాయకులు ఓటర్ల కాళ్లపై పడడం, ఇంటింటికీ తిరుగుతూ వారికి వివిధ సపర్యలు చేయడం చూస్తుంటాం. ఈ నాయకులను ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో ఓ విద్యార్థి సంఘం నాయకుడు అమ్మాయిల వెంటపడి మరీ కాళ్లపై పడ్డాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
రాజస్థాన్‌కు చెందిన విద్యార్థి సంఘం నాయకుడు విద్యార్థినుల కాళ్లపై పడి తమకు అనుకూలంగా ఓటు వేయాలని వేడుకున్నాడు. రాష్ట్రంలోని భరత్పూర్ జిల్లాలో జరిగిన ఈ అసాధారణ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. రెండేళ్ల విరామం తర్వాత రాజస్థాన్‌లో విద్యార్థి సంఘం ఎన్నికలు శుక్రవారం జరిగాయి. శనివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం ఫలితాలు వెలువడ్డాయి. కాగా, ఈ వీడియోకు ఇప్పటి వరకు దాదాపు లక్ష వ్యూస్ వచ్చాయి. ‘ఈ రోజు విద్యార్థి నాయకులు ఓటర్ల కాళ్ల దగ్గర ఉన్నారు.. ఎన్నికల తర్వాత ఓటరు ఈ నాయకులను వేడుకుంటాడు. ఇది ప్రకృతి నియమం.’ అని ఒకరు కామెంట్ చేశారు.
राजस्थान विश्वविद्यालय छात्र संघ चुनाव के दौरान प्रत्याशियों ने सड़क पर लेटकर पैर पकड़कर माँगे वोट. pic.twitter.com/rmvlgCFXgJ
— UnSeen India (@USIndia_) August 26, 2022