ఉదయ్‌పూర్: జాతీయ రహదారిపై ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. మితిమీరిన వేగం కారణంగా డ్రైవర్ ఆ కారుపై నియంత్రణ కోల్పోయాడు. అంతే.. అదపుతప్పిన కారు ఫల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పక్కన పడిపోయింది. ఇంతలో ఆ కారులోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ఇద్దరూ డోర్లు తెరుచుకుని వెంటనే బయటికి రావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఉదయ్‌పూర్ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్తుండగా ఖేర్వారా పోలీస్‌స్టేషన్ దగ్గర ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. కానీ అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది.