న్యూఢిల్లీ, : తనకు చెప్పకుండా భార్య పుట్టింట్లో ఒక రాత్రి ఉండిపోయిందనే కారణంతో భర్త ఆమెను చెంపదెబ్బ కొట్టడం అన్న ఒక్క సంఘటన ఐపీసీ సెక్షన్ 498ఏ కింద కూర్రత్వం కిందకు రాదని గుజరాత్ హైకోర్టు పేర్కొంది. క్రూరత్వం, ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణల కేసులో 23 ఏండ్ల తర్వాత భర్తను నిర్దోషిగా హైకోర్టు ప్రకటించింది.
భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిందని నిరూపించడానికి బలమైన ఆధారాలు అవసరమని పేర్కొంది. దిలీప్భాయ్ మంగళభాయ్ వర్లి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీలుపై కోర్టు ఈ తీర్పు వెలువరించింది.