ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన సాక్షి ఝా ప్లాస్టిక్ వ్యర్థాలను అప్‌సైకిల్ చేస్తూ, దేశ, విదేశాల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ధ్వంసం చేయకుండా వాటినే అత్యంత నాణ్యమైన, పర్యావరణ హితమైన కొత్త వస్తువులుగా తయారు చేయడమే అప్సైకిలింగ్. గాంధీ జయంతి సందర్భంగా 1,650 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలతో భారీ చరఖాను ఆమె తయారు చేశారు. స్కూల్ బెంచ్‌లు, అంగన్వాడీల కోసం ఫర్నిచర్ వంటివాటిని తయారు చేస్తూ, దాదాపు 50 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. సాక్షి మాట్లాడుతూ, తనకు కష్టకాలంలో మద్దతిచ్చినవారు ఈ పురస్కారాన్ని అందుకునేటపుడు తనకు గుర్తుకు వచ్చారని తెలిపారు.