బెంగళూరు, ఏప్రిల్ 24 : పట్టపగలు ఏదైనా వస్తువుపై సూర్యుడు వెలుగు పడుతుండగా.. దాని నీడ కనపడకపోవటం ఎప్పుడైనా చూశారా? ‘జీరో షాడో డే’గా పిలుస్తున్న అద్భుతమైన, అరుదైన సంఘటన మంగళవారం బెంగుళూరులో చోటుచేసుకోబోతున్నది.
శాస్త్రవేత్తలు చెప్తున్న ప్రకారం.. మధ్యాహ్నం 12.17 గంటలకు ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ క్యాంపస్లో 60 నుంచి 120 సెకండ్లపాటుపాటు పొడవైన వస్తువుల నీడ కనిపంచదు. 2021లో ఒడిశాభువనేశ్వర్లో ఈ అద్భుతం జరిగింది.