Assembly Election Results 2023: మధ్యప్రదేశ్‌లో అధికారం హస్తగతం చేసుకోవడానికి నానా తంటాలు పడ్డ కాంగ్రెస్‌కు మరోసారి తిరస్కరణ తప్పలేదు. ఆదివారం వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హస్తానికి షాకిస్తున్నాయి. అయితే ఎన్నికల ఫలితాలకు ముందే ఆ రాష్ట్ర పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించి బొక్క బోర్లా పడ్డారు. కచ్చితంగా గెలుస్తామనే అత్యుత్సాహంతో ఎన్నికల ఫలితాలు రాకముందే కమల్ నాథ్‌ను తదుపరి ముఖ్యమంత్రి అని శుభాకాంక్షలు చెబుతూ భోపాల్ లోని కాంగ్రెస్ కార్యాలయం ముందు బ్యానర్లు వెలిశాయి.
జనానికి అండగా నిలిచే వ్యక్తి మళ్లీ రాబోతున్నాడంటూ భోపాల్‌లో కాంగ్రెస్ అభిమానులు బ్యానర్లు పెట్టారు. కానీ ఫలితాలు మాత్రం ఆ పార్టీ ఆశించినదానికి పూర్తి భిన్నంగా వస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటల దాకా వెలువడ్డ ఫలితాల ప్రకారం.. 230 అసెంబ్లీ సీట్లు ఉన్న మధ్యప్రదేశ్‌లో బీజేపీ 164 సీట్ల ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 64 స్థానాల్లో మాత్రమే ముందుంది.
A poster congratulating Kamal Nath and portraying him as the next Chief Minister of Madhya Pradesh has been put up by a Congress worker outside the Congress office in Bhopal. pic.twitter.com/pX41zyoZgg
— ANI (@ANI) December 2, 2023