లక్నో: ఉత్తరప్రదేశ్, హజ్రత్గంజ్ ప్రాంతంలోని బీజేపీ ఎమ్మెల్యే యోగేశ్ శుక్లా అధికారిక నివాసంలో ఆయన మీడియా టీమ్ సభ్యుడు శ్రేష్ఠ్ తివారీ (30) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అరవింద్ కుమార్ వర్మ సోమవారం చెప్పారు. అయితే ఆత్మహత్యకు కారణమేమిటో స్పష్టంగా తెలియలేదని, తమకు ఫిర్యాదు రాలేదని చెప్పారు.
మృతుడు బారాబంకీ జిల్లాకు చెందినవారని చెప్పారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపించామన్నారు. ఈ సంఘటన జరిగినపుడు ఎమ్మెల్యే ఇక్కడ లేరని తెలిపారు.