బెంగళూరు, ఫిబ్రవరి 11: డ్రోన్ దాడులను అడ్డుకునే కొత్త వెహికిల్ మౌంటెడ్ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను మంగళవారం ఆవిష్కరించారు. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, డీఆర్డీవో కలిసి ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ప్రదర్శనలో డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ బీకే దాస్ దీనిని ఆవిష్కరించారు.
వాహనంలో అమర్చి ఉండే ఈ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ ద్వారా డ్రోన్ దాడులను సమర్థంగా అడ్డుకోవచ్చు. దీనికి అత్యాధునిక లేజర్, రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్లు, జామర్లతో పాటు 7.62 ఎంఎం గన్ ఉంటాయి. 10 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను ఇది కూల్చేయగలదు.