Mumbai police | దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ఒంటరిగా కనిపించిన మహిళ (lone woman)ను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవలే కాలంలో అనేకం వెలుగుచూసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా రైల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న యువతికి ఓ పోలీసు అధికారి రక్షణగా నిలిచారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఓ యువతి రాత్రి సమయంలో (night train) ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తోంది. అయితే, ఆ సమయంలో రైలు కోచ్‌లో యువతి తప్ప మరెవరూ లేరు. ఇది గమనించిన ఓ పోలీసు (Mumbai police) ఆమెకు రక్షణగా నిలిచారు. యువతి సీటుకు సమీపంలో ఒకచోట కూర్చుని ఎస్కార్ట్‌గా వ్యవహరించారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు ఆ పోలీసన్నపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
A Mumbai policeman accompanied a lone woman on a late night train, not to bother her but to keep her safe.
The coach was almost empty, so he stayed nearby to make her feel secure.
Small moments like this show real public service 🔥 pic.twitter.com/G4SM61vpjF
— News Algebra (@NewsAlgebraIND) November 18, 2025
Also Read..
Code Words | ఉగ్రదాడులు.. బిర్యానీ, దావత్ వంటి కోడ్ నేమ్స్‌తో సంభాషించుకున్న వైద్యులు
Delhi Blast | నగదు చెల్లించి బ్రెజా కారు కొనుగోలు చేసిన షాహీన్, ముజమ్మిల్.. ఫొటో వైరల్
Ambulance Catches Fire | మంటల్లో అంబులెన్స్.. నవజాత శిశువు, వైద్యుడు సహా నలుగురు సజీవదహనం