Code Words | ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో బయటపడ్డ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ (Faridabad terror module) సభ్యులను అధికారులు విచారిస్తున్నారు. వారి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. ఈ దర్యాప్తులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. వారి చాట్స్‌లో కొన్ని కోడ్ పదాలు (Code Words) బయటపడ్డాయి. టెర్రర్ వైద్యులు ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి బాంబు, దాడి కుట్రల గురించి చర్చించడానికి బిర్యానీ (Biryani), దావత్ (Dawat) వంటి పదాలను ఉపయోగించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ఉగ్రనెట్‌వర్క్‌లో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ షాహిన్ సాహిద్‌ను ‘మేడమ్ సర్జన్’గా పిలిచేవారని తేలింది. అంతేకాదు, అలాంటి మరికొన్ని కోడ్ నేమ్‌లు బయటకు వచ్చాయి. ఎన్క్రిప్టెడ్ యాప్‌లో కమ్యూనికేషన్ కోసం ఇలాంటి పదాలను వాడినట్లు అధికారులు గుర్తించారు. బిర్యానీని పేలుడు పదార్థాలకు కోడ్ పదంగా, దావత్‌ను దాడికి కోడ్ పదంగా ఉపయోగించినట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. ఢిల్లీ పేలుళ్ల వెనుక ఉన్న వైద్యులు ముజమ్మిల్ షకీల్, ఉమర్ ఉన్ నబీ, షాహీన్ సయీద్, అదీల్ రాదర్.. ఇవే కోడ్ పదాలతో దాడి గురించి చర్చించుకున్నట్లు తేలింది. ‘బిర్యానీ ఈజ్ రెడీ.. తినేందుకు సిద్ధం కండి’ అంటే దాడి కోసం బాంబు సిద్ధంగా ఉందని అర్థంగా అధికారులు గుర్తించారు.
Also Read..
Delhi Blast | నగదు చెల్లించి బ్రెజా కారు కొనుగోలు చేసిన షాహీన్, ముజమ్మిల్.. ఫొటో వైరల్
Ambulance Catches Fire | మంటల్లో అంబులెన్స్.. నవజాత శిశువు, వైద్యుడు సహా నలుగురు సజీవదహనం
Narayana Murthy | చైనా ఫార్ములాలో.. యువత 72 గంటలు పనిచేయాలి : ఇన్ఫీ నారాయణమూర్తి