Lok Sabha Elections | న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్లకు సంబంధించిన ఓ విషయం తాజాగా ఆసక్తికరంగా మారింది. గతంలో ఓ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన వీరిద్దరూ.. ప్రస్తుతం పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు. 2011లో వచ్చిన ‘మిలే నా మిలే హమ్’ చిత్రంలో వీరు హీరో హీరోయిన్లుగా నటించారు.
అయితే ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో తండ్రి రాం విలాస్ పాశ్వాన్ అడుగు జాడల్లో చిరాగ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తాజా ఎన్నికల్లో బీహార్లోని హాజీపూర్ నుంచి విజయం సాధించారు. ఎల్జేపీ నుంచి ఐదుగురు ఎంపీలుగా గెలుపొందారు. మరోవైపు కంగన.. బీజేపీ తరఫున మండి నియోజక వర్గం నుంచి విజయం సాధించారు.