Viral video : అది మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) నగరం..! ఓ లోకల్ రైలు (Local trail) ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ (Chhatrapati Shivaji terminus) నుంచి కళ్యాణ్ (Kalyan) కు బయలుదేరింది. రైలు ఘట్కోపర్ (Ghatkoper) స్టేషన్లో ఆగగానే షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు ఒంటిపై నూలుపోగు లేకుండా రైలెక్కాడు. నేరుగా మహిళల కంపార్టుమెంట్లోకే అతడు ప్రవేశించాడు. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
అతడిని రైల్లోంచి దిగిపోవాలంటూ మహిళలంతా కేకలు వేశారు. అయినా అతడు వినిపించుకోలేదు. రైల్లోంచి దిగేందుకు నిరాకరించాడు. దాంతో రైలు ఆపాలని మహిళలంతా గట్టిగా అరిచారు. మహిళల అరుపులు విని పక్క బోగీలో ఉన్న టీసీ అక్కడికి చేరుకున్నాడు. నగ్నంగా ఉన్న యువకుడిని కిందకు దిగమని హెచ్చరించాడు. అయినా అతడు నిరాకరించడంతో టీసీ అతడిని పక్క స్టేషన్లో బలవంతంగా కిందకు తోశాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు నిందితుడి తీరును తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. మరికొందరు రైళ్లలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఇంకొందరు మాత్రం నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. చివరికి అధికారుల విచారణలో కూడా నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని తేలింది. దాంతో అతడికి దుస్తులు ఇచ్చి బయటికి పంపించారు.
Mumbai Local Viral Video, naked man in mumbai local train pic.twitter.com/kjTGnnCkyd
— Chinmay jagtap (@Chinmayjagtap18) December 17, 2024